Thursday, September 22, 2011

మహేష్, శ్రీను వైట్ల ఃదూకుడుః చిత్రం కథ ఇదే...

మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న దూకుడు చిత్రం కధ అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఒకటి గత కొద్ది రోజులుగా వినపడుతోంది. వారు చెప్పుకునే దాని ప్రకారం...మహేష్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా చేస్తూంటాడు. అతను చేతుల్లోంచి నుంచి ఓ మాఫియా లీడర్ (ప్రకాష్ రాజ్)పొలిటికల్ పవర్ ఉపయోగించుకుని తప్పించుకుని పారిపోతాడు. అతన్ని పట్టుకుని తిరిగి పది రోజుల్లోగా సరెండర్ చేయకపోతే మహేష్ వి, అతని టీమ్ వి ఉద్యోగాలు పోతాయని అతని సుపీయర్ ఆఫీసర్ (నాజర్)హెచ్చరిస్తాడు. దాంతో ప్రకాష్ రాజ్ ని పట్టుకోవాలని బయిలుదేరతాడు. ఈ లోగా ప్రకాష్ రాజ్..టర్కీలో తేలతాడు. ప్రకాష్ రాజ్ ని పట్టుకునే క్రమంలో టర్కీకి వెళ్ళిన అతనికి సమంత పరిచయమై..ప్రేమలో పడతాడు. ఆమె నాజర్ కూతురని తర్వాత తెలుస్తుంది. మరి కొంత సమయం గడిచాక అస్సలు ప్రకాష్ రాజ్ తప్పించుకుపోవటానికి డిపార్టమెంట్ లోనే ఉండి సహాయం చేసింది నాజరే నని అర్దమవుతుంది. దాంతో నాజరే విలన్ అని అర్దం చేసుకున్న మహేష్ ఎలా ప్రూవ్ చేసాడు అన్నది మిగతా కథ అంటున్నారు. ఇక ఈ చిత్రం ట్రీట్ మెంట్ ఎక్కువ భాగం కామిడీతో రన్ అవుతుంది. అలాగే ఈ కథ నిజమవ్వటానికి ఎంత అవకాశముందో కాకపోవటానికి అంతే అవకాసం ఉంది. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు

Saturday, August 21, 2010

రేషన్‌కార్డు ఉంటేనే గ్యాస్‌

డీలర్లకు ప్రభుత్వ ఉత్తర్వులు 
ఖమ్మంలో 50 వేల కనెక్షన్ల రద్దు? 
gas
వినియోగదారుల నిరసన

రేషన్‌ కార్డు లేని వినియోగదారులకు గ్యాస్‌ నిలిపివేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు గ్యాస్‌ పంపిణీ సంస్థలకు (డీలర్లకు) ఆదేశాలు అందాయి. దీని వల్ల ఖమ్మం జిల్లాలోనే 50 వేల కనెక్షన్లు రద్దు కానున్నాయని ప్రాథమిక అంచనా. ఈ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గ్యాస్‌ వినియోగదా రులకు రేషన్‌ కార్డు విధిగా ఉండాలంటూ ప్రభుత్వం నిబంధన విధించినమాట వాస్తవమేనని ఖమ్మం డిఎస్‌ఓ దేవయ్య ధృవీకరించారు.
ప్రభుత్వ ఆదేశాలు సహజంగా సంబంధిత జిల్లా అధికారులకు అందుతాయి. రేషనుకార్డు నిబంధనకు సంబంధించిన ఉత్తర్వు మాత్రం గ్యాస్‌ పంపిణీ సంస్థలకు అందింది. ఉత్తర్వులు అందీ అందగానే ఖమ్మంలోని రవిచంద్ర గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు దాని అమలుకు పూనుకున్నారు. ప్రజాశక్తి ద్వారా ఈ విషయం తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి, గ్యాస్‌ ఎజన్సీతో మాట్లాడి ధృవీకరించుకున్నారు.

ఖమ్మం జిల్లాలో 2.51 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 50 వేల కనెక్షన్లు డ్వాక్రా సంఘాల సభ్యులవే. జిల్లాలో నెలకు లక్ష బండలను వినియోగిస్తున్నారు. ధరాభారం, సరఫరాలో లోపం మూలంగా డ్వాక్రా కనెక్షన్లలో అత్యధికం చేతులు మారాయి. పంపిణీ సంస్థల వద్ద 30 వేలకు పైగా దరఖాస్తులు మూలుగుతున్నాయి.
ఇదిలా వుండగా గ్యాస్‌ కనెక్షన్లు పొందడం కష్టంగా వున్న రోజుల్లో ఏదో ఒక పేరుతో కొందరు కనెక్షన్లు తీసుకున్నారు. ఇలాంటివారికి రేషన్‌ కార్డున్నా వేరే పేరు కనక గ్యాస్‌ ఇవ్వరు. సర్కారు నిర్ణయంతో ఎన్నో చిక్కులు,చీకాకులు వస్తున్నాయి.

<font color ="green">వరదలో కార్డులు గల్లంతు</font>
2007లో వచ్చిన వరదల మూలంగా భద్రాచలం ప్రాంతంలో వేలాది కుటుంబాల వారు ఇతర వస్తువులతో పాటు రేషన్‌కార్డు లనూ పొగొట్టుకున్నారు. వారిలో ఏ ఒక్కరికీ తిరిగి కార్డు దక్కలేదు. బియ్యం కొనుగోలు కుగాను అధికారులు కూపన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. భద్రాచలం డివిజనులో 45 వేల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. కార్డులు లేని ఫలితంగా ఇక్కడ పది వేల కనెక్షన్లు రద్దయ్యే అవకాశం ఉంది.

<font color ="green">కార్డు లేకపోతే తహశీల్దార్‌ ధృవీకరణ</font>
రేషన్‌కార్డు లేని వినియోగదారులు తహశీల్దారు నుంచి ధృవీకరణ పత్రం తీసుకుని గ్యాస్‌ పంపిణీదారులకు అందజేయాలి. ఏదో ఒకటి ఇచ్చేవరకూ గ్యాస్‌ పంపిణీకి పేర్లు నమోదు చేసుకోవద్దని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం రూపొందించిన పౌర పత్రం ప్రకారమే దరఖాస్తు చేసుకున్న వారం రోజులకు మాత్రమే ధృవీకరణ పత్రం ఇస్తారు. అందులోనూ వందలాది మంది ఒకేసారి ధృవీకరణ పత్రాల కోసం ఎగబడితే వారాల తరబడీ పనులు అయ్యే అవకాశం ఉంది. దీంతో గ్యాస్‌ అందక వినియోగదారులు ఇబ్బందులు పడక తప్పదు.

<font color ="green">నల్ల బజారుకు అవకాశం</font>
అటు రేషనుకార్డు లేక ఇటు రెవెన్యూ ధృవీకరణ దక్కకపోతే వినియోగదారులు గ్యాస్‌ కోసం నల్లబజారును ఆశ్రయించక తప్పదు. ఇప్పటికే ఖమ్మం నల్లబజారులో బండ ఒకటికి రూ. 550 పలుకుతోంది.

<font color ="green">ఖమ్మంలో 50 వేలు రద్దు </font>
కొత్త నిబంధనల ప్రకారం ఖమ్మం జిల్లాలో 50 వేల కనెక్షన్లు రద్దయ్యే ప్రమాదం ఉంది. అందులోనూ అత్యధికంగా డ్వాక్రా మహిళలే బలవుతారని ఆందోళన వ్యక్తమవుతోంది. రేషన్‌ కార్డులు లేని వేలాది మంది డ్వాక్రా మహిళలు రెవెన్యూ ధృవీకరణలతో గ్యాస్‌ కనెక్షను తీసుకున్నారు. అందువలన అలాంటివారి కనెక్షన్లన్నీ రద్దయ్యే అవకాశాలున్నాయి. కొందరు ఇతర ధృవీకరణలతో కనెక్షన్లు పొందారు. అవి కూడా రద్దవుతాయి.

<font color ="green">ఆదేశాలు వాస్తవమే : డిఎస్‌ఓ</font>
రేషన్‌ కార్డు ఉంటేనే గ్యాస్‌ పంపిణీకి పేరు నమోదు చేసుకుంటామంటూ ఉత్వర్వులు వెలువడిన విషయాన్ని ప్రజాశక్తి ద్వారా తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి దేవయ్య గ్యాస్‌ డీలర్లతో మాట్లాడి ధృవీకరించుకున్నారు. అయితే తమకెలాంటి ఆదేశాలూ రాలేదన్నారు. సంబంధిత ఆదేశాల నకళ్లను అన్ని ఏజెన్సీల నోటీస్‌ బోర్డులలో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.